: నంద్యాల ఉపఎన్నికల్లో మా పార్టీ నుంచి కూడా అభ్యర్థిని నిలబెడుతున్నాం: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి
భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఆ నియోజక వర్గంలో తమ తమ పార్టీల తరఫున పోటీకి దిగే అభ్యర్థులను టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ ఉపఎన్నిక విషయమై స్పందించిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. ఆ స్థానంలో పోటీకి తమ పార్టీ తరఫున కూడా అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వెంకయ్యనాయుడులకి అసెంబ్లీ సీట్ల పెంపు విషయం తప్ప, రాష్ట్ర విభజన హామీల అమలు అంశాన్ని పట్టించుకునే ఉద్దేశం లేదని అన్నారు. ప్రజల సమస్యలను వారు పట్టిచుకోవడం లేదని వ్యాఖ్యానించారు.