: రేపు జమ్మూకాశ్మీర్ వెళ్లనున్న రామ్‌నాథ్ కోవింద్
రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం జమ్మూ కాశ్మీర్ వెళ్లనున్నారు. కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హాజరు కాకపోవడంతో రేపు ప్రత్యేకంగా ఆ రాష్ట్ర ఎమ్మెల్యే, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, జితేంద్ర సింగ్‌లు కూడా శ్రీనగర్ వెళ్లనున్నారు.
ఇప్పటికే ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్‌ల్లో ప్రచారం పూర్తి చేసుకున్న కోవింద్, శ్రీనగర్ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్, బీజేపీ జనరల్ సెక్రటరీ అనిల్ జైన్‌లతో కలిసి పంజాబ్, హర్యానాల్లో పర్యటించనున్నారు. జూలై 1 తర్వాత దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కోవింద్ ప్రచారానికి రానున్నారు.