: గర్భవతితో రాయల్ బెంగాల్ టైగర్ ఆటలాడిన తమాషా వీడియో... !
ఓ గర్భవతిని ఆప్యాయంగా చూస్తూ, ఆమెతో రాయల్ బెంగాల్ టైగర్ ఆటలాడుకోగా, ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. బ్రిట్నీ ఓస్బర్న్ అనే యువతి, తన కజిన్, నిండు గర్భంతో ఉన్న నటాషా హ్యాండ్ షోను తీసుకుని ఇండియానాలోని పొటావాటోమి జూకు వెళ్లిన వేళ ఈ ఘటన జరిగింది. తన ఎన్ క్లోజర్ లో అద్దం వెనక ఉన్న పులితో సెల్ఫీ దిగేందుకు నటాషా ప్రయత్నించిన వేళ జరిగిన ఘటనను వీడియో తీసిన బ్రిట్నీ దాన్ని ఫేస్ బుక్ లో పంచుకోగా, చూసిన వారి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
"మేము జూకు వెళ్లినప్పుడు ఓ అందమైన పెద్దపులి వద్దకు వెళ్లాము. అది నా కజిన్ గర్భవతని తెలుసుకుంది. ఆమెను ఆప్యాయంగా పలకరించింది. కడుపులో ఉన్న బిడ్డను పలకరించాలనుకుంది. ఇందెంతో స్వీటెస్ట్ మూమెంట్" అని ఓ వీడియోను పెట్టింది. "నాకు నవ్వాలో, భయపడాలో తెలియడం లేదు. సో క్రేజీ" అని ఓ వ్యక్తి అంటున్న వ్యాఖ్యలు కూడా ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.