: మంత్రి నారాయణ కుమారుడి ప్రమాదం విషయంలో.. తెలంగాణ పోలీసులకు షాక్ ఇచ్చిన బెంజ్ కంపెనీ!


ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో మెట్రో పిల్లర్ ను ఢీకొని దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. మే 10వ తేదీ రాత్రి నిషిత్ ప్రయాణిస్తున్న బెంజ్ కారు అత్యంత వేగంతో పిల్లర్ ను ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నిషిత్ స్నేహితుడు కూడా మరణించాడు. ఈ నేపథ్యంలో ఎంతో అడ్వాన్స్ డ్ ఫీచర్లున్న అత్యంత ఖరీదైన ఈ కారు ఎంత వరకు సేఫ్టీ అనే సందేహాలు అందరికీ వచ్చాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమనే అంచనాకు తెలంగాణ పోలీసులు వచ్చినప్పటికీ... కారుకు సంబంధించిన కొన్ని విషయాలను బెంజ్ కంపెనీ నుంచి పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

వాహనంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయా? ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే వారి ప్రాణాలు ఎందుకు పోయాయి? తదితర ప్రశ్నలతో బెంజ్ కంపెనీకి టీఎస్ పోలీసులు లేఖ రాశారు. బెంజ్ కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో... ఈ మెయిల్ ద్వారా ఇదే విషయాన్ని మరోసారి తెలియజేశారు. ఈమెయిల్ పై స్పందించిన బెంజ్ కంపెనీ... ప్రమాదానికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో, పోలీసులు అవాక్కయ్యారు. రహస్యంగా ఉండాల్సిన దర్యాప్తు వివరాలను ఎలా ఇస్తామని వారు అంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

  • Loading...

More Telugu News