: సీరియస్ గా ఉండే ట్రంప్ మన ప్రధాని జోక్ కు హాయిగా నవ్వేశారు!
ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతమైంది. గతంలో ఏ దేశాధినేతతోనూ గడపనంత ఆనందంగా మోదీతో ట్రంప్ గడిపారు. తనను కలిసిన పలు అధినేతలతో ట్రంప్ సరిగా మాట్లాడని సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు దేశాధినేతల్ని అయితే ఆయన పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ఈ నేపథ్యంలో, మోదీతో కూడా ఆయన భేటీ సీరియస్ గానే ఉంటుందని పలువురు భావించారు.
అయితే, అంచనాలకు భిన్నంగా మోదీతో ట్రంప్ దంపతులు కలసిపోయారు. మోదీ దిగిన కారు వద్దకు వచ్చి ఆయనను వైట్ హౌస్ లోకి తోడ్కొనిపోయారు. భేటీ ముగిసేంత వరకు కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. వైట్ హౌస్ లోకి వెళుతున్న సమయంలో మోదీ ఏం జోక్ చేశారో కానీ... ట్రంప్ దంపతులిద్దరూ హాయిగా నవ్వుకున్నారు. అయితే, ఆ జోక్ ఏంటో బయటకు తెలవకపోవడం గమనార్హం.