: అల్లు అర్జున్ ‘డీజే’ను వదలని వివాదాలు... హైకోర్టులో పిటిషన్‌


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యువ దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమాను వివాదాలు వీడ‌డం లేదు. ఈ సినిమాలో నమకం, చమకం వంటి పవిత్రమైన పదాలను ఉప‌యోగిస్తూ హీరోయిన్ అందాల‌ను వ‌ర్ణించ‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన జి.కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆయా పదాలపై అభ్యంతరం తెలుపుతూ సెన్సార్‌ బోర్డుకు వినతిపత్రం సమర్పించినప్ప‌టికీ వాటిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆయ‌న చెప్పారు. ఈ పిటిష‌న్‌లో ప్రతివాదులుగా ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు అధికారి, వెంకటేశ్వర క్రియేషన్స్‌ తదితరులను పేర్కొన్నారు. అభ్యంతర‌క‌ర ప‌దాల‌ను తొలగించేవ‌ర‌కు ఆ సినిమాపై నిషేధం విధించాలని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రేపు విచార‌ణ జ‌ర‌గ‌నుంది.        

  • Loading...

More Telugu News