: మనకు మనమే శత్రువులం...?


మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నామా...? ఏమో...! కానీ మన దేశంలోని పొగాకుకు సంబంధించిన అనారోగ్యాలకు మనమే కారణమంటున్నారు మన దేశానికి చెందిన వైద్యుడు పంకజ్‌ చతుర్వేది. మనదేశంలోని పొగ రహిత పొగాకు పరిశ్రమ పలు క్యాన్సర్లకు కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముంబైలోని టాటా స్మారక ఆసుపత్రిలోని క్యాన్సర్‌ వైద్యనిపుణుడైన పంకజ్‌ చతుర్వేదికి ప్రతిష్టాత్మకమైన 'జ్యూడీ వికెన్‌ ఫెల్డ్‌' పురస్కారం లభించింది. గురువారం నాడు వాషింగ్టన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. పొగాకు పదార్ధాల నియంత్రణకు కృషి చేసినందుకుగాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆయన మన దేశంలోని పొగరహిత పొగాకు పరిశ్రమలు పలు క్యాన్సర్లకు కారణమని, మనభారతదేశం నోటిక్యాన్సర్ల రాజధానిగా అవతరించడం ఆందోళనకరమని తన ఆవేదన వ్యక్తం చేశారు. నిజమేనేమో... మనదేశంలో పొగాకు సంబంధిత పదార్ధాల ఉత్పత్తితోబాటు వాడకం కూడా ఎక్కువే. ఇకనైనా ఈ ఉత్పత్తుల పట్ల, వాడకం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి, నియంత్రిస్తే బాగుంటుందేమో...!

  • Loading...

More Telugu News