: ఈ ‘దొంగ’ తెలివితేటలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!
ఓ గదికి తలుపులు లేవని గ్రహించని ఓ దొంగ ఎంతో కష్టపడి కిటికీలు పగులగొట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి అందులోకి వెళ్లిన ఘటన అందరినీ నవ్విస్తోంది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఓ గ్యారేజ్‌లో దొంగతనం చేయాలని వచ్చిన ఆ దొంగవెనకభాగంలో ఉన్న ఓ తలుపు వద్దకు వెళ్లి దానిని తెరిచే ప్రయత్నం చేశాడు. అది సాధ్యం కాకపోవడంతో కిటికీ వద్దకు వెళ్లి ఎంతో కష్టపడిపోయి కిటికీలోంచి అందులోకి దూరాడు.
తీరా అందులోకి వెళ్లాక అతడికి తెలిసింది... దానికి అసలు మెయిన్ డోర్ లేనే లేదని. అదసలు ఓ గదిలాంటిదే కాదని, ఓ వరండా అని తెలుసుకుని ఎంతో నిరాశ చెందాడు. అందులో దొంగతనం చేయడానికి ఏమీ లేకపోవడంతో తిరిగివెనక్కి వెళ్లిపోయాడు. మీరూ చూడండి ఈ ‘దొంగ’ తెలివితేటలు...