: త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తా: ‘డీజే’ సీన్ల లీక్ పై దర్శకుడు హరీశ్ శంకర్
అల్లు అర్జున్ హీరోగా తాను తెరకెక్కించిన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలోని పలు సీన్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయని దర్శకుడు హరీశ్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై తాను త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. ఆన్‌లైన్‌లో కొందరు ‘డీజే’ దృశ్యాలను లీక్ చేస్తోన్న విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో తమ సినిమా దృశ్యాలను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరనున్నట్లు చెప్పాడు. కాగా, ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు, బన్నీ, పూజా హెగ్డేల మధ్య రొమాన్స్ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.