: 35 మందితో కలిసి జైలులోనే నిరాహారదీక్ష చేస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి!


చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రామాపురంలో రెండు రోజుల క్రితం పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అక్క‌డ‌ ఉన్న చెత్త డంపింగ్‌యార్డును తరలించాలన్న డిమాండ్‌తో ఆయ‌న‌ నిరాహారదీక్ష చేపట్టడంతో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేయాల్సి వ‌చ్చింది. ఆయ‌న‌ను పుత్తూరు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ప్ర‌స్తుతం ఆయ‌న చిత్తూరు సబ్‌జైలులో ఉంటున్నారు. ఆయ‌న‌తో పాటు మరో 35 మంది కూడా ఉన్నారు. జైలుకి వెళ్లిన‌ప్ప‌టికీ చెవిరెడ్డి త‌న నిర‌స‌న‌ను కొన‌సాగిస్తున్నారు. చెత్త డంపింగ్‌యార్డును అక్క‌డి నుంచి తరలించాల్సిందేన‌ని మిగ‌తా 35 మందితో క‌లిసి మూడు రోజులుగా ఆయన నిరాహారదీక్ష చేస్తున్నారు.     

  • Loading...

More Telugu News