: ‘ఈ రోజు నా ఆహారం ఇదే’ అంటూ.. పెద్ద ప్లేట్ నిండా ఉన్న చికెన్ బిర్యానితో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన చార్మీ


‘ఈ రోజు నా ఆహారం ఇదే' అంటూ ఓ పెద్ద ప్లేటు నిండా ఉన్న చికెన్‌ బిర్యానీతో తాను దిగిన ఫొటోను పోస్ట్ చేసి న‌టి చార్మీ సంబరపడిపోయింది. ఈ ఫొటో ఆమె అభిమానులను అల‌రిస్తోంది. డైనింగ్ టేబుల్ వ‌ద్ద కూర్చొని ఆ బిర్యానీని చూస్తూ ఎంతో సంతోష‌ప‌డుతున్న‌ట్లు, తాను బాగా ఆక‌లితో ఉన్నట్లు ఆమె ఆ ఫొటోలో క‌న‌ప‌డుతోంది. రంజాన్ సంద‌ర్భంగా త‌న ఇంట్లో పార్టీ చేసుకుంటున్న‌ట్లు తెలిపింది. అంత‌కు ముందు త‌న ఇంట్లో వండిన బిర్యానీ వీడియోను కూడా ఈ అమ్మ‌డు పోస్ట్ చేసింది. రంజాన్ సంద‌ర్భంగా త‌మ ఇంట్లో ఇలా ప్ర‌త్యేక వంట‌లు చేసుకుని ఎంజాయ్ చేస్తున్న‌ట్లు తెలిపింది.                                                        

  • Loading...

More Telugu News