: తన కూతురిలా డ్యాన్స్ చేస్తూ వెళ్లిన అక్షయ్ కుమార్.. అలరిస్తోన్న వీడియో!


బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న కూతురిని అనుకరిస్తూ, ఆమెలా డ్యాన్స్ చేస్తూ వెళుతున్న వీడియో ఆయ‌న అభిమానుల‌ను అమితంగా ఆక‌ట్టుకుటోంది. ఓ చోటుకి త‌న బుల్లి కూతురు నితారాతో వెళుతున్న అక్ష‌య్ కుమార్ ఆమెలా న‌డ‌వాల‌ని, ప‌రిగెత్తాల‌ని అనుకున్నాడు. అయితే, ఆమె రోడ్డుపై ఒక్కో కాలు ముందుకు వేస్తూ ప‌రిగెడుతోంది. దీంతో అక్ష‌య్ కుమార్ కూడా త‌న కూతురిని అనుక‌రిస్తూ ఎగురుతూ ఒక్కో కాలు ముందుకు వేస్తూ చేతులు అటూ ఇటూ క‌దిలిస్తూ ముందుకు వెళ్లాడు. ఈ వీడియోను అక్ష‌య్ కుమార్ పోస్ట్ చేస్తూ త‌న కూతురితో వెళుతున్న‌ప్పుడ‌ల్లా త‌న కాళ్ల‌లో స్పింగులు ఉన్న‌ట్లు అనిపిస్తోంద‌ని పేర్కొన్నాడు. ఇది ఫాద‌ర్‌,డాట‌ర్ టైమ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను త‌గిలించాడు. 

  • Loading...

More Telugu News