: 100 మంది కలిసి తయారు చేసిన ఈ పిజ్జా పొడవు 1.9 కిలో మీటర్లు
అమెరికాలో 100 మందికి పైగా చెఫ్‌లు ఒక్కచోట చేరారు. కొందరు వాలంటీర్లను తమకు సాయంగా తెచ్చుకున్నారు. 3,632 కేజీల రొట్టెల పిండిని, 1,634 కేజీల చీజ్‌ను, 2,542 కేజీల సాస్‌ను తీసుకొచ్చారు. రెండు కిలోమీటర్ల మేర పిండిని వేసి, మూడు ఇండస్ట్రియల్ ఓవెన్‌లను వాడి దాన్ని వేడి చేశారు. ఎనిమిది గంటలపాటు శ్రమించి 1,930.39 మీటర్ల పిజ్జాను తయారుచేసి గతంలో ఇటలీలోని నేపుల్స్‌లో తయారు చేసిన 1853.88 మీటర్ల పొడవైన పిజ్జా రికార్డును బద్దలు కొట్టేశారు.
ఈ ఈవెంట్ ను దగ్గరుండి పరిశీలించిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ నిర్ణేతలు ఈ పిజ్జాయే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పిజ్జా అని చెప్పేయగానే, చెఫ్‌లంతా కేరింతలు కొడుతూ పిజ్జాను కోసుకొని తినేశారు. అయితే, 1,930 మీటర్ల పొడవైన పిజ్జా కావడంతో అందులో చాలా భాగం మిగిలిపోయింది. అలా మిగిలిన భాగాన్ని అక్కడి స్వచ్ఛంద సంస్థలకి అందజేసి ఆకలితో బాధపడుతున్న వారికి ఇవ్వమని చెప్పారు. అమెరికాకు చెందిన పిజ్జాఓవెన్స్.కామ్ అనే రెస్టారెంట్ నిర్వాహకులు ఈ రికార్డును సాధించారు.