: ఫార్మా దిగ్గజం లుపిన్ ఛైర్మన్ కన్నుమూత


ఫార్మా దిగ్గజం లుపిన్ వ్యవస్థాపకులు దేశ్ బంధు గుప్తా ఈ ఉదయం కన్నుమూశారు. తమ తండ్రి మరణించారని ఆయన కుమారులు వినీత్ గుప్తా, శైలేష్ గుప్తాలు తెలిపారు. అసోసియేట్ ప్రొఫెసర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన దేశ్ బంధు 1968లో లుపిన్ ను ప్రారంభించారు. కేవలం రూ. 5 వేల పెట్టుబడితో సంస్థను నెలకొల్పారు. ఇప్పుడు ఈ సంస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. 100కు పైగా దేశాల్లో లుపిన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 1988లో లుపిన్ వెల్ఫేర్ అండ్ రీసర్చ్ ఫౌండేషన్ ను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ ఫౌండేషన్ కృషి చేస్తోంది.

  • Loading...

More Telugu News