: మీడియా సమావేశంలో మోదీ, ట్రంప్‌లను ఒక్కో విలేకరి ఒక్కో ప్రశ్న మాత్రమే అడగాలి: వైట్ హౌస్ నిబంధన


భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేస్తున్న‌ భారీ విందులో ఆయ‌న పాల్గొంటారు. ఆ విందులో పాల్గొనే ముందు మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియాతో సమావేశం అవుతారు. ఇందుకు సంబంధించి విలేక‌రుల‌కు వైట్‌హౌస్ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. విలేక‌రులు ఒక్కో ప్రశ్న మాత్ర‌మే అడ‌గాల‌ని, విలేక‌రి అడిగిన ఆ ప్ర‌శ్న‌కు ఇరు దేశాల అగ్ర‌నేత‌లు సమాధానం ఇస్తార‌ని తెలిపింది.

ఈ మీడియా స‌మావేశం 20 నిమిషాల పాటు ఉంటుంద‌ని శ్వేతసౌధం చెప్పింది. విలేక‌రుల స‌మావేశానికి ముందు ఇరు దేశాల ఉన్నతాధికారులు కూడా ద్వైపాక్షిక సంబంధాలపై జరిగే చర్చలో పాల్గొంటారని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత వైట్‌హౌస్‌లో ఆతిథ్యం స్వీకరిస్తున్న తొలి దేశాధినేత ప్రధాని మోదీనే.    

  • Loading...

More Telugu News