: జైల్లోని వస్తువులు ధ్వంసం, కాగితాలకు నిప్పు, అధికారులపై దాడి... మరోసారి వార్తల్లోకెక్కిన ఇంద్రాణి ముఖర్జియా
కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో ముంబైలోని బైకుల్లా జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. జైల్లో గుడ్లను దొంగిలించిందనే ఆరోపణలతో ఓ మహిళా ఖైదీని జైలు అధికారులు తీవ్రంగా కొట్టిన ఘటనలో సదరు మహిళ మృతి చెందింది. దీంతో జైలు అధికారుల అమానుష ప్రవర్తన పట్ల ఇంద్రాణితో పాటు జైల్లో ఉన్న దాదాపు 200 మంది మహిళా ఖైదీలు ఆందోళనకు దిగారు. జైల్లోని వస్తువులను ధ్వంసం చేశారు. కాగితాలకు నిప్పుపెట్టారు. తమను అడ్డుకున్న అధికారులపై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో, ఇంద్రాణితో పాటు మరో 200 మంది ఖైదీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.