: రజనీ రాజకీయ ప్రవేశంపై తెలివిగా సమాధానమిచ్చిన ధనుష్


కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ వీఐపీ-2 ట్రైలర్ లాంఛ్ చేశాడు. ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించాడు. ఈ సందర్భంగా మీడియా రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ధనుష్ నుంచి పలు అంశాలు రాబట్టాలని ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాన్ని ధనుష్ చాలా తెలివిగా తిప్పికొట్టాడు. ఈ సందర్భంగా మీడియా, ధనుష్ మధ్య సంభషణ ఎలా సాగిందంటే...

మీడియా: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై మీ అభిప్రాయం ఏంటి?
ధనుష్: మీకు 'వీఐపీ-2' సినిమా ట్రైల‌ర్ లాంచ్ కోస‌మే క‌దా ఆహ్వానం అందింది? పాలిటిక్స్ ఎంట్రీపై చ‌ర్చించ‌డానికి కాదు క‌దా?
మీడియా: సినీ నటులు కచ్చితంగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలా?... సినీ నటుల రాజకీయ రంగ ప్రవేశంపై మీ అభిప్రాయం ఏంటి?
ధనుష్: సినీ న‌టులు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వ‌కూడ‌ద‌ని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకూ ఓ అభిప్రాయం ఉంటుంది కదా? మీలాగే నాక్కూడా ఒక అభిప్రాయం ఉంది. మీ అభిప్రాయానికి మీరు కట్టుబడి ఉండండి....నా అభిప్రాయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇంక ట్రైలర్ లాంచ్ చేద్దాం... అంటూ ఆ సంభాషణను ముగించి, సినిమా గురించి మాట్లాడాడు. కాగా, సొంత బేనర్ పై రూపొందిన ఈ సినిమాకు అతని మరదలు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోంది. 

  • Loading...

More Telugu News