: దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనిదాన్ని కేసీఆర్ మాత్రమే చేశారు: హరీష్ రావు


దేశం మొత్తం మీద రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. రంజాన్ కు ఈ గుర్తింపును ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. సిద్ధిపేటలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని చాటే గొప్ప పండుగ రంజాన్ అని అన్నారు. ముస్లింలకు మాట ఇచ్చిన విధంగానే 12 శాతం రిజర్వేషన్లను కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపామని చెప్పారు. 200 మైనార్టీ స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. రంజాన్ సందర్భంగా 4 లక్షల మంది పేద ముస్లింలకు సరుకులు, బట్టలు ఇచ్చామని చెప్పారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

  • Loading...

More Telugu News