: తమిళ బిగ్‌బాస్ మొదటి ఎపిసోడ్ ప్రసారం.. పోటీదారులలో నమిత!
నెలరోజులుగా ప్రోమోస్‌తో ఊదరగొడుతున్న బిగ్‌బాస్ తమిళ వెర్షన్ మొదటి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా 100 రోజుల పాటు కెమెరాల మధ్య వసతి గృహంలో నివసించబోయే 15 మంది పార్టిసిపెంట్లను కమల్ పరిచయం చేశారు. వీరిలో చాలా మంది వర్థమాన తమిళ నటులు ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమున్న కథానాయిక నమిత కూడా వీరిలో వుండడం విశేషం.
మొదటి ఎపిసోడ్‌లో పోటీదారుల పరిచయం, పోటీ షరతులు, నియమాల వర్ణనతో కార్యక్రమం పేలవంగా సాగింది. వ్యాఖ్యాతగా కమల్ చాలా వరకు తన చరిష్మాతో నెట్టుకొచ్చారు. త్వరలో తెలుగులో కూడా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ షో రానున్న విషయం తెలిసిందే.