: 'ఛలో అమరావతి పాదయాత్ర జరిపి తీరుతా.. చావో, రేవో తేల్చుకుంటా'నన్న ముద్రగడ.. రోడ్ మ్యాప్ విడుదల
కాపు రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని కాపు నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. తమ హక్కుల సాధన కోసం ఛలో అమరావతి పేరిట పాదయాత్ర చేస్తానంటే, తనను బెదిరిస్తున్నారని చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన పాదయాత్ర ఆగదని... యాత్ర చేసి తీరుతానని తెలిపారు. జూలై 26 నుంచి చేపట్టనున్న పాదయాత్రతో... ప్రభుత్వంతో చావో, రేవో తేల్చుకుంటానని అన్నారు.
ఈలోపలే రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి తేల్చాలని డెడ్ లైన్ విధించారు. కాపులను చంద్రబాబు విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఆయన విడుదల చేశారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈ యాత్ర తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల గుండా అమరావతికి చేరేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.