: అమెరికా సాంకేతిక వ్యవస్థపై విరుచుకుపడ్డ ఐఎస్ఐఎస్!


అమెరికన్ సాంకేతిక వ్యవస్థపై దాడి చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పలు ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేసి, తమకు అనుకూలమైన నినాదాలు పోస్టు చేశారు. ఓహియో రాష్ట్ర గవర్నర్ జాన్ కిసిచ్ కార్యాలయ అధికార వెబ్ సైట్ తో పాటు ప్రభుత్వ విభాగాలైన రిహాబిలిటేషన్, హెల్త్ ట్రాన్స్ ఫర్మేషన్, వర్క్ ఫోర్స్ ట్రాన్స్ ఫర్మేషన్ ల వెబ్ సైట్లు హ్యక్ అయ్యాయని 'జిన్హువా' వార్తా సంస్థ పేర్కొంది. తమ దేశాల్లో జరుగుతున్న రక్తపాతానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జవాబుదారిగా ఉండాలన్న నినాదాలను వెబ్ సైట్ హోం పేజీలపై ఉంచారు. విషయం తెలుసుకున్న టెక్ నిపుణులు నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు. సైబర్ సెక్యూరిటీలోని లోపాలతో పాటు, హ్యాకింగ్ ఎలా జరిగిందన్న విషయమై విచారిస్తున్నట్టు ఓహియో పరిపాలనా విభాగం వెల్లడించింది.

  • Loading...

More Telugu News