: అమెరికాలో సుష్మా స్వరాజ్ ను ప్రశంసించిన మోదీ


భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పై ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో ప్రశంసల వర్షం కురిపించారు. వాషింగ్టన్ లో భారతీయులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్‌ మీడియాను ప్రభావవంతంగా వాడడంలో సుష్మా స్వరాజ్‌ ముందుంటారని కితాబునిచ్చారు. తాను కూడా సోషల్ మీడియాలో ప్రజలతో సంబంధాలు నెరపుతుంటానని ఆయన చెప్పారు. అయితే సోషల్‌ మీడియాను వినియోగించడం ద్వారా శాఖను బలోపేతం చేయడంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ, సుష్మా స్వరాజ్‌ మంచి ఉదాహరణగా నిలుస్తారని ఆయన ప్రశంసించారు. ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సరే భారతీయులు సమస్యల్లో ఉన్నామని ట్వీట్‌ చేస్తే చాలు సుష్మా స్వరాజ్‌ సమస్యను పరిష్కరిస్తారని ఆయన అభినందించారు. విదేశీ మంత్రిత్వ శాఖతో పాటు దౌత్య రంగానికి ఆమె మానవీయకోణాన్ని జోడించారని ఆయన కొనియాడారు. 

  • Loading...

More Telugu News