: టీమిండియాకు ఇలాంటి కోచ్ కావాలనేది గంగూలీ కోరిక!
టీమిండియా హెడ్ కోచ్ గా వెస్టిండీస్ టూర్ వరకు వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికీ... కుంబ్లే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హెడ్ కోచ్ లేకుండానే టీమిండియా జట్టు విండీస్ లో పర్యటిస్తోంది. కొత్త కోచ్ ను ఎంపిక చేసే పనిలో ప్రస్తుతం బీసీసీఐ, క్రికెట్ అడ్వైజరీ కమిటీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కమిటీలో ఒకడైన గంగూలీని 'ఎలాంటి హెడ్ కోచ్ కావాలని మీరు భావిస్తున్నారు?' అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా 'మ్యాచ్ లను గెలిపించే సత్తా ఉన్న కోచ్ కావాలి' అంటూ దాదా ఒక్క మాటలో సమాధానమిచ్చాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీని కలుపుకుపోయే విధంగా కోచ్ ఉంటే బాగుంటుందనే చర్చ కూడా కొనసాగుతోందని సమాచారం.