: హైదరాబాదులో చంద్రబాబు నివాసానికి టీ-టీడీపీ నేతలు.. అల్పాహార విందు!


తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ఉదయం హైదరాబాదులో చంద్రబాబు నివాసం చేరుకుని తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ అధినేతతో చర్చించారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్, నామా నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, గరికపాటి తదితరులు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడే వీరికి అల్పాహార విందు ఏర్పాట్లను చంద్రబాబు చేశారు. ఆయన హైదరాబాద్ లో నూతన గృహ ప్రవేశం చేసిన తరువాత నేతలతో ఇంట్లో జరుపుతున్న తొలి సమావేశం ఇదే. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా వీరి మధ్య చర్చ సాగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News