: ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా.. ఆస్ట్రేలియా రికార్డు బద్దలు!


టీమిండియా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచంలోనే ఎక్కువసార్లు 300 పైచిలుకు పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డే సిరీస్‌లో భాగంగా పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌లో విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 311 పరుగులు చేసిన భారత్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. టీమిండియా ఇలా 300కు పైగా పరుగులు చేయడం ఇది 96వ సారి. ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (95)ను రెండో స్థానానికి నెట్టేసింది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా (77), పాకిస్థాన్ (69), శ్రీలంక (63), ఇంగ్లండ్ (57), న్యూజిలాండ్ (51) వరుసగా నిలిచాయి.

  • Loading...

More Telugu News