: 40 ఏళ్ల నాటి బొమ్మ బాంబు పేలి ఆరుగురు చిన్నారుల మృతి


దాదాపు 40 సంవత్సరాల క్రితం సోవియట్ యూనియన్ కు చెందిన సైన్యం జార విడిచిన ఓ బొమ్మ బాంబు పేలగా, ఆరుగురు చిన్నారులు మరణించిన ఘటన వాయవ్య పాకిస్తాన్‌ అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల్లో గల దక్షిణ వజీరిస్తాన్‌ జిల్లాలో జరిగింది. చనిపోయిన వారందరూ 6 నుంచి 12 సంవత్సరాల్లోపు వయసు వారేనని, ఇటువంటి ఘటనలు ఈ ప్రాంతంలో అధికంగా జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

కాగా, 1980వ దశకంలో, ఆఫ్గనిస్థాన్ లో తమ ఆక్రమణలను వ్యతిరేకించిన వారి ప్రాణాలను తీసేందుకు ఈ తరహా బొమ్మ బాంబులను సోవియట్ సైన్యం యుద్ధ విమానాల నుంచి జార విడిచేవి. వాటిల్లో కొన్ని వందల బాంబులు పేలకుండా ఉండిపోగా, అవి బయట పడినప్పుడల్లా ఈ తరహా ప్రమాదాలు జరగుతూ ఉన్నాయి.

  • Loading...

More Telugu News