: అమెరికాలో భరత్ భార్య... రాకుండానే అంత్యక్రియలు 'కూలి కర్మ'తో ముగించేసిన వైనం!


శుక్రవారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డులో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు భార్య అమెరికాలో ఉండగా, కనీసం ఆమెకైనా కడసారి చూపు దక్కకుండానే అంత్యక్రియలు ముగిసిపోయాయి. భరత్ భార్య అమెరికాలో ఉంది. ఈ దంపతులకు సంతానం లేదు. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు నోవాటెల్ హోటల్ కు వెళ్లిన భరత్, రాత్రి 9:20 గంటలకు బయటకు వచ్చి, ఆపై నిమిషాల వ్యవధిలోనే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చిన పోలీసులు, ఆ సమయంలో భరత్ మద్యం తాగి ఉన్నాడా అన్న విషయం తేల్చేందుకు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపిన సంగతి విదితమే. ఇక తొలి నుంచి వివాదాస్పదుడైనా, ఎప్పుడు సినీ తారల క్రికెట్ మ్యాచ్ జరిగినా, మంచి ప్రతిభను కనబరిచే భరత్, అర్థాంతరంగా దూరం కావడం కలచి వేస్తోందని పలువురు సినీ తారలు వ్యాఖ్యానించారు. ఆయన చనిపోయిన తరువాత, రవితేజ సహా, పలువురు కుటుంబ సభ్యులు రాకపోవడం, ఓ జూనియర్ ఆర్టిస్టుకు డబ్బులిచ్చి 'కూలి కర్మ' చేయించారని వచ్చిన వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. 

  • Loading...

More Telugu News