: విభజన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం: వెంకయ్యనాయుడు


రాష్ట్ర పునర్విభజన సమస్యలన్నీ పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఉపాధ్యాయ సంఘాలు వెంకయ్యనాయుడిని ఈరోజు సన్మానించాయి. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఏకీకృత రూల్స్ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని 4 లక్షలకు పైగా టీచర్లకు లబ్ది చేకూరుతుందని, సర్వీసు రూల్స్ ఆమోదం కోసం 1998 నుంచి టీచర్లు కృషి చేస్తున్నారని అన్నారు. ఇకపై పుస్తకాలు, పండ్లు, ఖద్దరుతో సన్మానాలు చేయడం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు సూచించారు.

  • Loading...

More Telugu News