: మహాప్రస్థానానికి చేరుకున్న భరత్ మృతదేహం!


హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు అంత్యక్రియలు జరుగుతున్నాయి. భరత్ రాజు అంత్యక్రియలను ఆయన సోదరుడు రఘు పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆయన చూస్తుండగా, సినీ నటుడు ఉత్తేజ్ ఆయనకు సాయపడుతున్నాడు. భరత్ ను కడసారి చూసేందుకు ఆయన మిత్రులు, ప్రముఖ హాస్య నటులు అలీ, రఘుబాబు, నిర్మాతలు తదితరులు హాజరయ్యారు. భరత్ కు నివాళులర్పించారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రిలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.  

  • Loading...

More Telugu News