: ఫెన్సింగ్ దిమ్మెను కూలగొట్టిన సీపీఐ నారాయణ.. స్వల్పగాయాలు!


విశాఖలో భూ ఆక్రమణల పరిశీలనకు వెళ్లిన సీపీఐ నారాయణకు స్వల్పగాయాలయ్యాయి. ఆక్రమిత భూముల పరిశీలన సందర్భంగా ఫెన్సింగ్ గోడ నాణ్యతను పరిశీలించే క్రమంలో దానిని పదేపదే ఆయన తన్నారు. ఈ క్రమంలో సిమెంట్ దిమ్మె ఆయన కాలిపై పడటంతో స్వల్పగాయాలయ్యాయి. ఆయన వెంటే ఉన్న సీపీఐ కార్యకర్తలు తక్షణం స్పందించి, నారాయణ కాలిపై పడ్డ సిమెంట్ దిమ్మెను తొలగించారు. స్వల్ప గాయాలపాలైన నారాయణను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News