: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన కిదాంబి!
తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించే దిశగా మరో అడుగు ముందుకు వేశాడు. ఇటీవలి కాలంలో సంచలన విజయాలతో మంచి ఊపులో ఉన్న శ్రీకాంత్ ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ ఫైనల్లో చైనాకు చెందిన చెన్ ఎల్ పై తొలి సెట్ ను 22-20 తేడాతో విజయం సాధించాడు. ఈ ఉదయం 11:32 గంటల సమయానికి రెండో సెట్ లోనూ పైచేయి సాధించి 6-4 తేడాతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సెట్ ను శ్రీకాంత్ గెలిస్తే, తన ఖాతాలో నాలుగో సూపర్ టైటిల్ జమ అవుతుంది. నిన్న జరిగిన సెమీస్ లో చైనాకు చెందిన నాలుగో సీడ్ యూకీ షైపై 21-10, 21-14తో కిదాంబి శ్రీకాంత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.