: పాక్ లో ఘోర దుర్ఘటన... ఒలికిపోయిన చమురును సేకరిస్తుంటే, మంటలంటుకుని 123 మంది దుర్మరణం
పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర పరిధిలోని బహావల్ పూర్ సమీపంలోని అహ్మద్ పూర్ షర్కియా వద్ద జరిగిన ఘోర దుర్ఘటన అమాయకులైన 123 మంది ప్రాణాలను బలిగొంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ చమురు ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడటంతో, అందులోని ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. చుట్టు పక్కల ప్రజలు దాన్ని డబ్బాల్లో ఎత్తుకుని తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. ప్రజలు ఆయిల్ ను సేకరిస్తున్న సమయంలో దానికి మంటలు అంటుకుని క్షణాల్లో ఆ ప్రాంతాన్నంతా కబళించి వేశాయి. ఈ ప్రమాదంలో 123 మంది సజీవదహనం కాగా, మరో 40 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని అధికారులు పేర్కొన్నారు.