: శివగామి పాత్రను ఎందుకు అంగీకరించలేదన్న ప్రశ్నకు శ్రీదేవి ఇచ్చిన సమాధానమిది!


జక్కన్న చిత్ర రాజం బాహుబలి తొలి భాగం విడుదలైన తరువాత, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ఎంతగా వైరల్ అయిందో, రెండో భాగం కూడా బయటకు వచ్చిన తరువాత, శివగామి పాత్రను అందాల నటి శ్రీదేవి ఎందుకు అంగీకరించలేదన్న ప్రశ్న వైరల్ అయింది. ఈ పాత్రకు తొలుత శ్రీదేవిని అనుకుని, ఆమెను కలిశామని స్వయంగా రాజమౌళి కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ఇదే ప్రశ్నను ఆమె ముందుంచారు.

తను నటించిన తాజా చిత్రం 'మామ్' వచ్చే నెల 7న విడుదలకు సిద్ధమైన సందర్భంగా సినిమా ప్రమోషన్ లో ఉన్న శ్రీదేవిని, ఏ కారణంతో బాహుబలి చిత్రాన్ని అంగీకరించలేదు? అని ప్రశ్నించగా, "నేనింత వరకూ ఈ చిత్రాలను చూడలేదు. ఇప్పుడు ఈ విషయంలో నేను మాట్లాడాలి. నేనీ సినిమాను వద్దని చెప్పడం ఎంతో పెద్ద విషయమని ప్రజలు అనుకుంటున్నారు. ఈ చిత్రం రెండు భాగాలూ బయటకు వచ్చిన తరువాత, ఈ ప్రశ్న పలుమార్లు నాకు ఎదురైంది. నేను వద్దనుకున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఈ సినిమా గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారు?" అంటూ శ్రీదేవి ఎదురు ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News