: ఐసీసీ మహిళల ప్రపంచ కప్: టీమిండియా శుభారంభం.. ఇంగ్లండ్‌పై ఘన విజయం
మహిళల క్రికెట్ వరల్డ్‌కప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఇంగ్లండ్‌లోని డెర్బీలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 35 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్ విమెన్ పూనమ్ రౌత్ (86), స్మృతి మందన (90), కెప్టెన్ మిథాలీ రాజ్ (71), హర్మన్ ప్రీత్ కౌర్ (24, నాటౌట్) అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థి ముందు భారత్ భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.
అనంతరం 282 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట్స్ విమెన్‌లలో సారా టైలర్ (22), కెప్టెన్ హెదర్ నైట్ (46), ఫ్రాన్ విల్సన్ (81), కేథరిన్ బ్రంట్ (24) మినహా మరెవరూ ఆకట్టుకోలేకపోయారు. స్మృతి మందనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.