: వరల్డ్ టూర్ కి వెళ్లనున్న రజనీ ‘రోబో 2.0’ సినిమా టీమ్!
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న రోబో 2.0 సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని ఆ సినిమా యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఈ ఏడాది దీపావళి రోజున, ట్రైలర్‌ను రజనీకాంత్ బర్త్ డే రోజున విడుదల చేయాలని అనుకుంటున్నారు. రోబో 2.0 ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా యూనిట్ వరల్డ్ టూర్‌కి వెళ్లనుంది. రోబో 2.0 విడుదల కానున్న దేశాల్లో ఈ చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.