: పెదవులపై విషం...?


చక్కటి పెదవులకు మరింత మెరుపులీనడంకోసం ప్రస్తుతం మహిళలంతా కృత్రిమ రంగులపై ఆసక్తి చూపుతున్నారు. అయితే అవి విషతుల్యాలంటే నమ్ముతారా...? నమ్మితీరాలంటున్నారు... కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని బెర్కిలే హెల్త్‌ స్కూల్‌ పరిశోధక బృందం. అందంగా కనిపించే అధరాలు మరింత అందంగా కనిపించడం కోసం మార్కెట్లలో లభించే కృత్రిమమైన రంగుల రూపంలోని లిప్ట్‌స్టిక్‌లను వాడడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోతోంది. అయితే ఈ లిప్‌స్టిక్స్‌లో మన ఆరోగ్యానికి హానికలిగించే పలు రసాయనాలు ఉన్నాయట.

మెడికల్‌ షాపుల్లోను, ఇంకా ఇతర దుకాణాల్లోను మనవారు కొంటున్న లిప్‌స్టిక్స్‌లో సీసం, కాడ్మియం, క్రోమియం, అల్యూమినియంలతోబాటు మరికొన్ని రసాయనాలు ఉన్నాయట. వాటిని మనం వాడడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా ఇలాంటి రంగులు వాడకుండా ఉండడమే మంచిది. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అయినా సహజంగా ఉండే రంగు కాదని, కృత్రిమ రంగులను వాడడమేల, దానివల్ల మన ఆరోగ్యం పాడుకావడమేల....?!

  • Loading...

More Telugu News