: వితంతువులు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు: హరీష్ రావు


వితంతు పునర్వివాహం ఎంతమాత్రం తప్పు కాదని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. సామాజిక దురాచారాలను అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వితంతువుల పట్ల ఉన్న వివక్షను రూపుమాపాలంటే... ముందు ప్రతి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లిలో మార్పు రావాలని చెప్పారు. బాల్యవివాహాలు, గుడుంబా వల్లనే ఈ పరిస్థితి నెలకొందని హరీష్ అన్నారు. వితంతువులను వేధించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించి, జైల్లో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ కృషి వల్ల ఇప్పటికే 90 నుంచి 95 శాతం గ్రామాలు గుడుంబారహితం అయ్యాయని చెప్పారు.

  • Loading...

More Telugu News