: కేసులతో తిరుగుతున్న జగన్ నుంచి మేమే నీతులు నేర్చుకోవాలా?: ఏపీ హోంమంత్రి


విశాఖ భూ అక్రమాలను నిగ్గుదేల్చేందుకు ప్రభుత్వం సిట్ ను వేస్తే ప్రతిపక్ష నేత జగన్ తప్పుబడుతున్నారంటూ ఏపీ హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. నిజాలను వెలికితీసేందుకు వివిధ శాఖల అధికారులతో కూడిన సిట్ ను కాకుండా జగన్ ని వేయమంటారా? అని ప్రశ్నించారు. అనేక కేసులతో తిరుగుతున్న జగన్ నుంచి తాము నీతులు నేర్చుకోవాలా? అని ఎద్దేవా చేశారు.

రెండు నెలల్లోనే భూ అక్రమాలకు సంబంధించిన విచారణ ఒక కొలిక్కి వస్తుందని... ఆరు నెలల్లోగా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీక్ష చేపడుతున్నానంటూ ముద్రగడ ఎప్పుడూ చెప్పుకుంటుంటారని... దీక్ష కోసం ఆయన ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదని విమర్శించారు. ఆయన దరఖాస్తు చేసుకుంటే తాము అనుమతి ఎందుకు ఇవ్వమని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News