: చరిత్రలోనే తొలిసారి.. పార్లమెంటు భవనంలో సినిమా ఫంక్షన్!


అనునిత్యం రాజకీయాలతో దద్దరిల్లుతూ ఉండే పార్లమెంటు భవనం, చరిత్రలోనే తొలిసారి ఓ సినిమా ఫంక్షన్ కు వేదిక అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు తిగ్మాంషు ధూలియా తెరకెక్కించిన 'రాగ్ దేశ్' సినిమా ట్రైలర్ ను పార్లమెంటు భవనంలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అనుమతులను ఇప్పటికే మంజూరు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

  • Loading...

More Telugu News