: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బెయిల్ మంజూరు!
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి పుత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చిత్తూరు జిల్లాలోని సి.రామాపురంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించాలంటూ చెవిరెడ్డి దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చెత్త తరలింపును ఆయన అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు చెవిరెడ్డితో పాటు పలువురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి తదితరులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.