: ఐసిస్ ఉగ్రవాది సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను విచారిస్తున్న పోలీసులు!


సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ తల్లిదండ్రులను కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులు విచారిస్తున్నారు. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు చల్లపల్లి మండలం మాజేరు గ్రామం నుంచి వచ్చి మందర గ్రామంలో స్థిరపడ్డారు. పదేళ్ల క్రితం చదువుకు గుడ్ బై చెప్పిన సుబ్రహ్మణ్యం హైదరాబాదుకు వచ్చాడు. ఆ తర్వాత ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఈ క్రమంలో ఇస్లాం మతాన్ని స్వీకరించి ఒమర్ గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత ఐసిస్ నేతల ఆదేశానుసారం దేశంలో పలు చోట్ల విధ్వంసకర చర్యలకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో, అతడిని అరెస్ట్ చేశారు. మరోవైపు సుబ్రహ్మణ్యం నేపథ్యం ఏమిటనే దానిపై ఎన్ఐఏ, సిట్ లు ఆరాతీస్తున్నాయి.

  • Loading...

More Telugu News