: వీసా కేసులో భారీ మూల్యం చెల్లించిన ఇన్ఫోసిస్
అమెరికాలో ఉండే క్లయింట్ల వద్దకు ఉద్యోగులను పంపించి అక్కడి వీసా నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 1 మిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని న్యూయార్క్ నగరానికి చెల్లించింది. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పులు చేయకున్నా సంబంధిత పత్రాల్లో పొరపాట్ల వల్ల మాత్రమే ఈ జరిమానా చెల్లించాల్సి వచ్చిందని కంపెనీ ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సేవల నెపంతో వందల మంది విదేశీయులను తమ దేశానికి పంపి, వీసా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఇక్కడి యువతకు అవకాశాలు ఇవ్వకపోవడంపై తాము సహించేది లేదని న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ టి ష్నీడెర్మన్ అభిప్రాయపడ్డారు.