: మిథాలీ రాజ్ అదరగొట్టావ్...పో!: సానియా మీర్జా ప్రశంసలు


భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ను ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభినందించింది. ఐసీసీ మహిళా వరల్డ్ కప్ ప్రారంభం నేపథ్యంలో మహిళా క్రికెట్ జట్ల కెప్టెన్లకు ఐసీసీ విందు ఏర్పాటు చేసింది. అనంతరం మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాకిస్థాన్ కు చెందిన జర్నలిస్టు మిథాలీ నీకు పాక్, భారత జట్ల క్రికెటర్లలో ఎవరంటే ఇష్టమని అడిగాడు.

దీంతో ఫైరైన మిథాలీ... ఇదే ప్రశ్న ఎవరైనా క్రికెటర్ ని నీకు ఏ మహిళా క్రికెటర్ ఇష్టమని అడగగలవా? అంటూ ప్రశ్నించింది. దీంతో అతను చిన్నబోయాడు. దీనిపై మీడియా కథనాలు వెలువడడంతో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ ను అభినందించింది. 'చంపేశావ్ పో' అంటూ ప్రశంసించింది. కాగా, వీరిద్దరూ హైదరాబాదుకు చెందిన క్రీడాకారిణులు కావడం విశేషం. సానియాతోపాటు పలువురు మాజీ క్రీడాకారులు కూడా మిథాలిపై ప్రశంసలు కురిపించారు. 

  • Loading...

More Telugu News