: రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ప్రకటించిన నితీశ్ కుమార్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు బీహార్ సీఎం నితీశ్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాతే రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయిన మీరాకుమార్ అంటే తనకు చాలా గౌరవమని, అయితే, రాష్ట్రపతి రేసులో ఓటమి తప్పదని తెలిసే ఆమె ముందుకు వచ్చారని అన్నారు. గతంలో కూడా తాము, స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నామని, ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని నితీశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.