: తీవ్ర క‌డుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన హిందీ కమెడియన్‌


ముంబ‌యిలో షూటింగ్‌లో పాల్గొంటున్న స‌మ‌యంలో ప్రముఖ హిందీ కమెడియన్‌ భారతి సింగ్ కి తీవ్ర క‌డుపునొప్పి రావ‌డంతో ఆమెను ఆ సినిమా యూనిట్ ఆసుప‌త్రికి త‌ర‌లించింది. ఆమెకు వైద్య‌ పరీక్షలు నిర్వ‌హించిన వైద్యులు ఆమె కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌పడుతోంద‌ని, చికిత్స చేయాలని చెప్పారు. ఆమె పరిస్థితి ప్ర‌స్తుతం నిలకడగా ఉందని అన్నారు. ఆమె ఈ రోజు ఆసుప‌త్రి నుంచే సామాజిక మాధ్య‌మంలో త‌న‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. తాను కోలుకోవాలని కోరుకున్న వారికి థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News