: శిరీషది ఆత్మహత్యే అనడానికి మా వద్ద ఆధారాలున్నాయి: డీసీపీ వెంకటేశ్వరరావు


బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై శిరీష సంబంధీకులెవరికైనా అనుమానాలుంటే తీరుస్తామని అన్నారు. కుకునూర్ పల్లి ఎస్సై క్వార్టర్స్ లోనే ఈ వ్యవహారమంతా జరిగిందని, ఫాంహౌస్ లో కాదని.. ఇందుకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్నది ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా వెల్లడిస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా, శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News