: అలాంటి వ్యక్తిని బీజేపీ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు!: అసదుద్దీన్ ఒవైసీ మండిపాటు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ పై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2010లో రామ్ నాథ్ కోవింద్ ఏం మాట్లాడారో అందరూ తెలుసుకోవాలని అన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు భారతీయులు కాదని ఆయన అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఒవైసీ ప్రస్తావించారు. అలాంటి వ్యక్తిని బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని విమర్శించారు. కాగా, రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తదితరులు హాజరయ్యారు.