: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్: తలపడ్డ ఇద్దరు భారత ఆటగాళ్లు.. సెమీస్‌కు దూసుకెళ్లిన కిదాంబి శ్రీకాంత్
సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. భారత్ నుంచి సైనా, సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ రోజు ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య పోరు జరిగింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌తో తలపడగా... తొలి గేమ్‌ని 25-23తో, రెండో గేమ్‌ని 21-17తో కైవసం చేసుకొని కిదాంబి శ్రీకాంత్ సెమీస్‌కి దూసుకెళ్లాడు. తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ఇటీవలే ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే.