: ఇకపై పాస్ పోర్టులను హిందీ, ఇంగ్లిష్ రెండు భాషల్లోనూ మంజూరు చేస్తాం: సుష్మా స్వరాజ్
ఇకపై మంజూరు చేయబోయే పాస్ పోర్ట్ లు ఇంగ్లీషు తో పాటు హిందీ భాషలో కూడా ఉంటాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. పాస్ పోర్టు యాక్టు,1967 అమల్లోకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, ఎనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు, అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులకు పాస్ పోర్టు ఫీజ్ లో 10 శాతం తగ్గింపు ఉంటుందని ఆమె ప్రకటించారు.