: ఆ ఆటగాడు పోస్ట్ చేసిన తన కుమారుడి వీడియో కడుపుబ్బా నవ్విస్తోంది... నవ్వు ఆపుకోలేరు.. చూడండి!
అమెరికా ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు క్రిస్ రెయినీ తన కుమారుడిని ఆడిస్తుండగా తీసిన ఓ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. క్రిస్ రెయినీ ఇటీవల ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. అందుకు కారణం ఆ వీడియోలో తన కుమారుడు తూగుతూ కింద పడిపోతూ, మళ్లీ లేస్తూ మళ్లీ కింద పడిపోవడమే. ఇంతకీ ఆ చిన్నారి ఇలా ఎందుకు ప్రవర్తించాడంటే.. ఆ బాలుడి తండ్రి క్రిస్ రెయినీ పార్క్ లో ఉండే గుండ్రంగా తిరిగే కుర్చీలో కూర్చోపెట్టి, గిరగిరా సుమారు 25 సెకన్లపాటు తిప్పాడు.
దీంతో ఆ పిల్లాడు ఎంతో ఆనందపడ్డాడు. వెంటనే ఆ పిల్లాడిని క్రిస్ రెయినీ కిందకు దించేశాడు. అంతసేపూ గుండ్రంగా తిరిగి తిరిగి ఒక్కసారిగా అందులోంచి బయటకు రాగానే ఆ పిల్లాడు కింద పడిపోయాడు. మళ్లీ పైకి లేచి మళ్లీ కింద పడిపోయాడు.. పట్టువదలని విక్రమార్కుడిలా అలా కొన్నిసార్లు పైకి లేవడానికి ప్రయత్నించి, చివరికి గట్టిగా నిలబడి మరో ఆట ఆడుకోవడానికి వెళ్లిపోయాడు. తన కుమారుడు కిందపడిపోతుండడం చూసిన క్రిస్ రెయినీ నవ్వు ఆపుకోలేక కిందపడిపోయాడు. ఈ రోజు మరోసారి ట్వీట్ చేసిన క్రిస్ రెయినీ ఈ వీడియోకు ఇంతగా స్పందన వచ్చినందుకు హర్షం వ్యక్తం చేశాడు. తన కుమారుడు కూడా ఆ వీడియోను చూసి నవ్వుతున్నాడని మరో వీడియోని పోస్ట్ చేశాడు.. మీరూ చూడండి...